శ్రీలంక పోలీసుల వాహనంగా మహీంద్రా స్కార్పియో

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ అధ్యక్షుడు పవన్ గోయెంకా మాట్లాడుతూ.. శ్రీలంక పోలీసు బలగాల కోసం అలాగే, రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్ఓడి) మహీంద్రా స్కార్పియో ఎల్ఎక్స్ 4డబ్ల్యూ ఎస్‌యూవీను ఎన్నుకోవడం మాకెంతో గర్వంగా ఉంది. పోలీస్ మరియు ఎమ్ఓడిల రోజూవారీ కార్యకలాపాల్లో ఇది మంచి పేరు తెచ్చుకోగలదని నేను ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు. భారత ఎస్‌యూవీ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించిన మహీంద్రా స్కార్పియో ఎల్ఎక్స్ వెర్షన్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








