తెలంగాణాలో మహీంద్రా ప్లాంట్‌కు అదనపు రాయితీలు: ప్రభుత్వం

Mahindra
వ్యవసాయ యంత్ర పరికరాల తయారీలో అగ్రగామిగా ఉన్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ జిల్లాలో ఓ ట్రాక్టర్ యూనిట్ నెలకొల్పడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం మహీంద్రా కంపెనీ ట్రాక్టర్స్ డివిజన్ సీఈవో విశ్వంభర్ మిశ్రా మరియు ఆయన బృందం రాష్ట్రప్రభుత్వంతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో స్థాపించబోయే ఈ ట్రాక్టర్ యూనిట్‌కు అదనపు రాయితీలు ఇవ్వటానికి రాష్ట్ర సర్కారు సముఖతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి తన అంగీకారాన్ని ప్రకటించారు.

కొత్తగా స్థాపింటబోయే ఈ ట్రాక్టర్ యూనిట్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా 250 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి జె. గీతారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. శ్యామ్‌బాబు కూడా పాల్గొన్నారు. ఇతర సంస్థలకు రాయితీలు ఇచ్చిన విధంగానే మహీంద్రా అండ్ మహీంద్రాకు కూడా ఐదేళ్లపాటు 50 శాతం వ్యాట్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి అలాగే పరోక్షంగా మరో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా.. వెనకబడిన తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌కు ఎస్ఐపీసీ సిఫారసు చేసిన దాని కంటే కూడా మరింత అదనంగా రాయితీలు మంజూరు చేయాలని మంత్రి గీతారెడ్డితో పాటు కంపెనీ కోరడంతో ముక్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Article Published On: Saturday, February 19, 2011, 11:37 [IST]
English summary
Giving a major fillip to industrialisation in the backward Telangana region, Mahindra and Mahindra (M&M) will soon set up a tractor manufacturing unit at its Zaheerabad facility in Medak district of Andhra Pradesh. M&M has proposed to invest Rs. 250 crore on the tractor manufacturing facility over the next three years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+