టాటా మ్యాజిక్‌కు పోటీగా మహీంద్రా మాక్సిమో మినీ వ్యాన్

Mahindra Maxximo
యుటిలిటీ వాహన ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా అండ్‌ మహీంద్రా మార్కెట్లో మరో కొత్త ప్యాసింజర్ వ్యాన్‌ను విడుదల చేసింది. నెక్స్ట్ జనరేషన్‌ మాక్సిమో మినీ వ్యాన్‌ను ఎమ్ అండ్ ఎమ్ ప్రారంభించింది. మార్కెట్లో దీని ధర రూ. 3.2 (ఎక్స్‌ షోరూమ్ నేవీ ముంబై) లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వ్యాన్‌ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో మహారాష్ట్రలోని చాక్కన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసినట్లు ఎమ్ అండ్‌ ఎమ్ అధ్యక్షుడు (ఆటోమోటివ్‌ మరియు వ్యవసాయ పరికరాల విభాగం) పవన్‌ గోయెంకా తెలిపారు.

టాటా మ్యాజిక్, మారుతి ఓమ్నీలకు మాక్సిమో గట్టి పోటీ ఇస్తుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా గల 230 డీలర్లు, 600 ఔట్‌లెట్ల ద్వారా మాక్సిమో వ్యాన్ అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. ఈ మినీ వ్యాన్‌కు పెద్ద బాడీతో పాటు లోపల విశాలమైన స్థలం ఉంటుందని, ఇంకా ఇందులో మోనోకోక్యు చాసిస్‌, ఇండిపెండెంట్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌ ఉండంటం వల్ల ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

మాక్సిమో మినీ వ్యాన్‌ 900 సీసీ ట్విన్-సిలిండర్ సీ2 సీఆర్‌డీఈ డీజిల్‌ ఇంజన్ టెక్నాలజీని కలిగి ఉండి, 25 హార్స్‌పవర్‌ శక్తితో గంటకు 70 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ వివరించింది. ఇది లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. మాక్సిమో మినీ వ్యాన్‌‌లో ఎనిమిది మంది పెద్దవాళ్లు కూర్చుని సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది డైమండ్ వైట్, ఆపీ రెడ్ అనే రెండు రంగులలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 28, 2011, 14:09 [IST]
English summary
Mahindra & Mahindra Ltd., a part of the US $11.1 billion Mahindra Group, today announced the launch of the Maxximo Mini Van, its next generation passenger carrier, in Mumbai. Developed on the technologically superior Maxximo platform, the Mini Van is set to redefine the face of the entry-level contract carriage and stage carriage segments in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+