ఆరు వేల బుకింగ్స్ సొంతం చేసుకున్న ఎక్స్‌యూవీ500!

మార్కెట్ వర్గాల నుండి అందిన అనధికారిక సమాచారం ప్రకారం.. ఎక్స్‌యూవీ500 విడుదలైన రెండు రోజుల్లోనే సుమారు 6,000 బుకింగ్‌లను సొంతం చేసుకున్నట్లు సమాచారం. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఈ ఇంజన్ సుమారు 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ సొంతం.
ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) మోడల్ ధర రూ. 10.80 లక్షలు
ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 11.95 లక్షలు
ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 12.88 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








