సింగూర్ బిల్లుపై సుప్రీం తీర్పును స్వాగతించిన మమత

మమతా బెనర్జీ సర్కారు ఆమోదించిన 'సింగూర్ ల్యాండ్ రిహాబిలేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 2011' బిల్లుపై ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా టాటా మోటార్స్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు టాటా మోటార్స్ పిటిషన్‌ను తిరస్కరించడంతో మంగళవారం టాటా మోటార్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భూపంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని మమత సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications








