బుల్లెట్-ప్రూఫ్ కార్లకు 'నో' చెప్పిన సీఎం మమతా బెనర్జీ!!

Mamata Banerjee
దీదీ ఏంచేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది, రోటీన్‌కు బిన్నంగా వ్యవహరించడం, లగ్జరీ సదుపాయాలకు ఆమడ దూరంలో ఉండటం ఆమె స్పెషాలిటీ. ప్రజలతో పాటే తనూ అంటుంది. ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. తను మరెవరో కాదు తాజాగా కోల్‌కతా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ది మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ "మమతా బెనర్జీ". మమత రక్షణ కోసం 24x7 పనిచేసేలా కేటాయించిన బుల్లెట్-ప్రూఫ్ అంబాసిడర్ కార్లను ఆమె తిరస్కరించారు. ఇదేదో ధిక్కారమనుకుంటే మన పొరపాటే. తాను కూడా సాధారణ వ్యక్తి మాదిరిగానే సమాజంలో మెలగాలనేది ఆమె అభిమతం. అందుకే తన రక్షణ కోసం ఇచ్చిన బుల్లెట్-ప్రూఫ్ కార్లను వద్దని, పార్టీ బహుకరించిన కారు అయిన హ్యుందాయ్ శాంత్రో (రిజిస్ట్రేషన్ నెం. WB 02U 4397) లోనే ప్రయాణిస్తున్నారు.

నలుపు రంగులో ఉండే హ్యుందాయ్ శాంత్రో హ్యాచ్‌బ్యాక్ కారును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ చైర్‌పర్సన్ కోసం కొనుగోలు చేసింది. ఈ కారు మమత ఆల్-టైమ్ ఫేవరెట్ కూడా. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు మమతా బెనర్జీ తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) "మహీంద్రా స్కార్పియో"ను ఉపయోగిస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ ఎస్‌యూవీనే మమత ఎక్కువగా ఉపయోగించారు. అంతేకాదు తాను సిటీలో పర్యటించేటప్పుడు ఎక్కువ కార్లను వినియోగించడాన్ని కూడా తగ్గించాలని ఆమె భద్రతా సిబ్బందిని కోరారు.

అందుకే మమత సిటీలో పర్యచించేటప్పుడు తొమ్మిది క్ననా తక్కువ కార్లు మాత్రమే ఉంటాయి. ప్రజా ధనాన్ని తన వ్యక్తిగత భద్రత కోసం వినియోగించడం ఇష్టం లేదని అందుకే బుల్లెట్-ప్రూఫ్ కార్లను నిరాకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. మమత ఎల్లప్పుడూ కారు ముందు సీట్లో కూర్చునే ప్రయాణిస్తారు. ఓ మెడికల్ కిట్, చాక్లెట్లు ఆమె కార్లో ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంత అధికారం, సంపద ఉన్నప్పటికీ సాధాసీదాగా కనిపించడం దీదీ స్పెషాలిటీ. అందుకే.. ఆమె అభిమానులందరూ.. ఈస్ట్ టూ వెస్ట్ దీదీ ఈజ్ ది బెస్ట్ అంటుంటారు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 24, 2011, 8:11 [IST]
English summary
Kolkata new CM, the most powerful women in the country Mamta Banerjee, denied bullet proof Ambassador car provided for her security. Instead of those cars she prefers traveling with her Hyundai Santro, resistration number WB 02U 4397. This black color hatchback was gifted to her by the Trinamool Congress Party.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+