మానేసర్ ప్లాంటు సమస్య రాజకీయ సమస్య: మారుతి

Maruti Stirke
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటు కార్మికుల విషయంలో అంత కఠినంగా వ్యవరహించడానికి గల కారణం ఇప్పుడు బట్టబయలైంది. గత పది రోజులుగా మానేసర్ ప్లాంటులో కార్మికులకు మరియు యాజమాన్యానికి మధ్య అన్యోన్య వాతారణం కరువైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మానేసర్ ప్లాంటులో తలెత్తిన కార్మిక సమస్యను మారుతి సుజుకి రాజకీయ సమస్యగా అభివర్ణించింది.

"నాకు తెలిసి మానేసర్ కార్మిక సమస్య ఖచ్చితంగా ఒక రాజకీయ సమస్యే మరియు వర్కర్ల నుంచి ఎలాంటి ముఖ్యమైన డిమాండుతో కూడుకున్న సమస్య మాత్రం కాద"ని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) చైర్మన్ ఆర్.సి. భార్గవ కంపెనీ 30వ సార్వజనిక వార్షిక సదస్సులో తెలిపారు. ఇది రాజకీయ సమస్య కాబట్టే, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోసం మారుతి స్థాపించిన ప్రిన్సిపల్స్ ఆధారంగా వీటి సంస్కరణలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఈ విషయంలో తాము ఏ మాత్రం రాజీకు వచ్చే ప్రసక్తే లేదని, కార్మికులతో తాము చర్చలు జరుపుతున్నామని, ఈ విషయంలో రాజీ పడబోమని వారికి స్పష్టం చేశామని ఆయన అన్నారు. ఏదేమైనప్పటికీ ఈ సమస్య త్వరలోనే సద్దుమణిగిపోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతి సుజుకి గత నెల 29 నుంచి మానేసర్ ప్లాంటులో తీవ్రంగా ఉత్పత్తిని నష్టపోతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 16:35 [IST]
English summary
Country's largest carmaker Maruti Suzuki India (MSI) Chairman R.C. Bhargava said the labour problem at its Manesar plant as a “political issue” and Company will not compromise on its established norms for industrial relations while attempting to resolve the disturbance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+