రేపట్నుంచి మానేసర్ ప్లాంటుల్ ఉత్పత్తి యాధాతథం: మారుతి

Maruti 800
మారుతి సుజుకి కంపెనీపై శనివారం సెంటిమెంట్ బాగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల మొదటి శనివారం (04.06.2011) కార్మికుల సమ్మె కారణంగా హర్యానాలోని మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే గురువారం రాత్రి కార్మికులకు యాజమాన్యానికి మధ్య కుదిరిన సయోధ్య కారణంగా ఇరు వర్గాలు బెట్టు వదలి గట్టు దిగాయి. దీంతో ఈ శనివారం (18.06.2011) నుండి మానేసర్ ప్లాంటులో పూర్తిస్థాయి ఉత్పత్తిని కొనసాగిస్తామని కంపెనీ ప్రకటించింది.

"గత రాత్రి సమ్మె ముగియడంతో శనివారం నుంచి సాధారణ ఉత్పత్తి ప్రారంభమవుతుంద"ని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మొత్తం 13 రోజుల పాటు జరిగిన ఈ సమ్మె కారణంగా కంపెనీ దాదాపు 12,600 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయినట్లు అంచనా, దీని విలువ సుమారు రూ. 630 కోట్లు. ఈ సందర్భంగా వర్కర్లు కూడా తమ విజయాన్ని పురస్కరించుకొని ప్లాంటులో శనివారం పూజ నిర్వహించి తమ పనిని ప్రారంభిస్తామని, ఆదివారం సాధారణంగా శెలవు అయినప్పటికీ కూడా నష్టపోయిన ఉత్పత్తి లోటును భర్తీ చేసేందుకు పనిచేస్తామని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2011, 15:03 [IST]
English summary
India's largest passenger car maker Maruti Suzuki India (MSI) today said normal production will resume at its Manesar plant from tomorrow, following the end of 13-day long strike by workers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+