మానేసర్ సమ్మె ఎఫెక్ట్: కొత్త స్విఫ్ట్ బుకింగ్‌లు రద్దు

New Swift
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మానేసర్ ప్లాంటులో పలుసార్లు తలెత్తిన సమ్మె కంపెనీ అమ్మకాలపై తీవ్ర ప్రభావాలను చూపుతోంది. ముఖ్యంగా కంపెనీ ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టి సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై ఈ ప్రభావం మరీ స్పష్టంగా కనపడుతోంది.

మొదటి నుండి మారుతి సుజుకి స్విఫ్ట్‌కు మార్కెట్లో మంచి ప్రజాదరణ ఉంది. కాగా.. స్విఫ్ట్‌కు మరిన్ని హంగులు చేర్చి తాజాగా ప్రవేశపెట్టడంతో ఈ మోడల్‌కు డిమాండ్ మరింత జోరందుకుంది. అయితే, ఈ సమ్మె కారణంగా స్విఫ్ట్ ఉత్పత్తిపై ప్రభావం పడటం, అధిక డిమాండ్ కారణంగా వచ్చి లక్షకు పైగా బుకింగ్స్ కారణంగా కొత్త స్విఫ్ట్ డెలివరీ కోసం వెయింటిగ్ పీరియడ్ గణనీయంగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో తమ డ్రీమ్ కారు కోసం అంతంత కాలం వేచియుండలేని కొనుగోలుదారులు తమ బుకింగ్‌లను రద్దు చేసుకొని ఇతర కంపెనీల వైపుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్ మోడల్ కోసం దాదాపు ఆరునెలల వెయింటిగ్ పీరియడ్ ఉండగా.. డీజిల్ వెర్షన్ మోడల్ కోసం ఏడునెలలకు పైగా నిరీక్షించాల్సి వస్తోందని మారుతి సుజుకి డీలర్ ఒకరు తెలిపారు.

అధిక వెయిటింగ్ పీరియడ్ కారణంగా కొనుగోలుదారులు స్విఫ్ట్ ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారని, దాదాపు 2 నుంచి 4 శాతం కొనుగోలుదారులు ఇలా స్విఫ్ట్ ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ విధంగా స్విఫ్ట్ ఆర్డర్లను రద్దు చేసుకున్న వారు స్విఫ్ట్ పోటీ బ్రాండ్‌లు అయిన టొయోటా ఎతియోస్ లివా, ఫోక్స్‌వ్యాగన్ పోలో వంటి కార్లను ఎంచుకుంటున్నట్లు డీలర్లు వాపోతున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, October 29, 2011, 10:55 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India face about 2-4 per cent cancellation of new Swift orders labour strikes at Manesar Plant. Half the customers who cancelled orders have opted for rival brands such as Toyota Liva and Volkswagen Polo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+