మానేసర్ సమ్మె ప్రభావం: భారీగా క్షీణించిన మారుతి లాభాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు 59.81 శాతం క్షీణించాయి. ఈ త్రైమాసికంలో మారుతి సుజుకి నికర లాభం రూ.240.40 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఇదే సంవత్సరంలో కంపెనీ నికర లాభాలు రూ.598.24 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2008-09 తర్వాత ఇంత అధిక మొత్తంలో లాభాలు పడిపోవడం ఇదే తొలిసారి.
మారుతి సుజుకి ప్లాంట్లలో తలెత్తిన కార్మిక సంక్షోభం కారణంగా ఉత్పత్తి భారీగా క్షీణించడం ఫలితంగా అమ్మకాలు పెద్ద ఎత్తున పడిపోవడం వలన ఈ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కంపెనీకు తెలిపింది. ఈ త్రైమాసికంలో సంస్థ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయం 14.38 శాతం తగ్గి రూ.7,831.62 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయానికి నిర్వణాదాయం రూ.9,147.27 కోట్లుగా ఉంది.
అలాగే, గడచిన త్రైమాసికంలో వాహనా విక్రయాలు కూడా 19.56 శాతం క్షీణించి 2,52,307 యూనిట్లకు పడిపోయాయి. క్రితం సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ మొత్తం 3.13,654 యూనిట్లు విక్రయించింది. మారుతి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న అల్టో మోడల్ అమ్మకాలు కూడా 20 శాతం క్షీణించి 22,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 27,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. మొత్తంమ్మీద కార్మిక సంక్షోభం మారుతి సుజుకి తీవ్ర నష్టాలను మిగిల్చింది.


Click it and Unblock the Notifications








