చైనా ప్రజలకు 'నానో' కారుగా మారిన మారుతి 800 కారు

మన దేశపు 'మారుతి 800' కారుకి చైనా వాళ్లు పెట్టుకున్న పేరు 'ఎమ్2కే సుజుకి ఆల్టో'. ఈ కారును జియాంగ్నన్ ఆటో అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో దీని ధర రూ. 17,800 ఆర్‌ఎమ్‌బి (అంటే సుమారు రూ. 1,24,600). ప్రస్తుతం చైనాలో ఇదే అత్యంత చవకైన కారు. మారుతి 800 (చైనాలో ఆల్టో అని పిలుస్తారు) కారును చైనాలో ఇప్పటి వరకూ చాంగన్ ఆటో, జియాంగ్ నన్, జియాన్ థాయ్ మరియు సిచువాన్ ఆటో అనే నాలుగు విభిన్న కంపెనీలు ఉత్పత్తి చేశాయి. వీటిల్లో ప్రతి కంపెనీ కూడా తమ ఫ్యాక్టరీలను మూసేడయమో లేక ఈ కారు ఉత్పత్తిని నిలిపివేయడమే చేశాయి. కాగా.. ఇప్పుడు తాజాగా ఉత్పత్తి చేస్తున్న జియాంగ్నన్ ఆటో మారుతి 800 కారును అభివృద్ధి చేస్తున్న ఐదో కంపెనీ కావడం విశేషం.
ప్రస్తుతం చైనాలోని కాలుష్య నిబంధనలకు లోబడి ఈ కారు ఇంజన్‌ను రీ-ట్యూన్ చేసి జియాంగ్నన్ ఆటో విడుదల చేసింది. మన దేశంలో తొలుత లక్ష రూపాయలకే కారు అని చెప్పి డప్పుకొట్టుకున్న టాటా నానో.. ఇప్పుడు బేసిక్ మోడల్ నానో ఎక్స్-షోరూమ్ ధరే సుమారు లక్షా యాబై వేల రూపాయలు పలుకుతోంది. మన నానో కారుతో పోల్చుకుంటే చైనా వారి ఆల్టో (మారుతి 800) కారే చవకైనది. మరి జియాంగ్నన్ ఆటో మారుతి 800 (చైనా వాళ్ల 'ప్రజల కారు') కారును విజయవంతగా ఉత్పత్తి చేస్తుందో లేక ఇదివరకటి నాలుగు కంపెనీల మాదిరిగానే మధ్యలోనే నిలిపివేస్తుందో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








