మారుతి ఏ-స్టార్ వర్సెస్ హ్యుందాయ ఐ10: ఏది బెస్ట్?

Maruti A-Star vs Hyundai i10
భారత కార్ మార్కెట్లో మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీలు చిరకాల ప్రత్యర్థులన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ రెండు కంపెనీలు ఒకరికి పోటీగా మరొకరు ఉత్పత్తులను అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి అందిస్తున్న ఏ-స్టార్‌ (విఎక్స్ఐ వేరియంట్)కు, హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 (స్పోర్ట్స్ వేరియంట్)కు మధ్య ఉన్న వ్యత్యాసాలేంటో చూద్దాం.

* మారుతి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ కారులో ఈబిడి(ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో ఏబిఎస్ (యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉంది. కానీ ఐ10 స్పోర్ట్స్‌లో ఈ ఫీచర్ లేదు. అత్యవసర సమయాల్లో బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు ఏర్పడే ప్రమాదాలను ఏబిఎస్ నియంత్రిస్తుంది.

* మారుతి ఏ-స్టార్‌లో టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ ఉంది. ఐ10 స్పోర్ట్స్‌లో ఈ ఫీచర్ లేదు. ఇది సేఫ్టీకు సంబంధించిన ఫీచర్.

* మారుతి ఏ-స్టార్‌లో డ్రైవర్ ఎత్తుకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే అడ్జస్టబుల్ సీట్ ఉంది. కానీ ఐ10లో ఇది లేదు. ఈ ఫీచర్ డ్రైవర్ సౌకర్యంగా కారు డ్రైవ్ చేసేందుకు ఉపకరిస్తుంది.

* మారుతి ఏ-స్టార్‌ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ. ఐ10 స్పోర్ట్స్ గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీ. దీనివలన ఏ-స్టార్ కారులో గతుకుల రోడ్లపై కూడా సురక్షితంగా ప్రయాణించవచ్చు.

* మారుతి ఏ-స్టార్‌ మొత్తం వెడల్పు 1600 మి.మీ. ఐ10 స్పోర్ట్స్ మొత్తం వెడల్పు 1595 మి.మీ. దీన్నిబట్టి చూస్తే.. మారుతి ఏ-స్టార్‌ కారు కాస్తంత స్పేషియస్‌గా ఉంటుంది.

* మారుతి ఏ-స్టార్ ఫ్రంట్, రియర్ ట్రాక్‌లు వరుసగా 1405 మి.మీ., 1400 మి.మీ. అదే ఐ10 స్పోర్ట్స్ ఫ్రంట్, రియర్ ట్రాక్‌లను పరిశీలిస్తే అవి వరుసగా 1400మి.మీ., 1385 మి.మీ. ఇది బెటర్ హ్యాండ్లింగ్ కోసం ఉపయోగపడుతుంది.

* మారుతి ఏ-స్టార్‌లో కీ-ఆఫ్ రిమైండర్ ఉంది. కానీ ఐ10 స్పోర్ట్స్‌లో లేదు. ఇది కారు యొక్క అధనపు భద్రతకు ఉపకరిస్తుంది.

* మారుతి ఏ-స్టార్‌ విఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 4.48 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు). ఐ10 స్పోర్ట్స్ వేరియంట్ ధర రూ. 5.15 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు). ధరను బట్టి చూస్తే.. ఏ-స్టార్ కారును కొనుగోలు చేయడం వలన రూ.67,000 నగదు బెనిఫిట్‌ను పొందడమే కాకుండా మారుతి సుజుకి కంజ్యూమర్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

ఇంకా మారుతి సుజుకి ఏ-స్టార్ కారులో అడ్వాన్స్‌డ్ 998 సీసీ కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది స్పోర్టీ లుక్‌నిచ్చే ఏరోడైనమిక్స్‌ను కలిగి ఉండి, రిమోట్ కంట్రోల్డ్ డోర్ లాక్స్‌తో లభిస్తుంది. మరి మీ ఆప్షన ఏంటి...? మారుతి సుజుకి ఏ-స్టార్ కారా... లేక హ్యుందాయ్ ఐ10 స్పోర్ట్స్ కారా...!?

More from DriveSpark

Article Published On: Thursday, September 22, 2011, 17:46 [IST]
English summary
Maruti A-Star VXi vs Hyundai i10 Sports: Which is best and why. Here is the comparison, take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+