బాండ్‌పై సంతకం చేయని ఉద్యోగుల సంగతి అంతే...

గుడ్ కండక్ట్ బాండ్‌పై సంతకం చేయడానికి తిరస్కరించే, ప్రస్తుత ఉన్న శాస్వత ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులను శాస్వత ప్రాతిపదిక నియమించనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇప్పటి వరకూ 103 మంది కార్మికులు బాండ్లపై సంతకాలు చేసి, తిరిగి విధుల్లోకి చేరారని కంపెనీ ప్రకటించింది. ఆగస్టు 29 మానేసర్ ప్లాంట్లులో కార్మికులకు మరియు యాజమాన్యానికి మధ్య సఖ్యత లోపించిన సంగతి తెలిసిందే.
మానేసర్ ప్లాంటులోని కార్మికులు కావాలనే నాణ్యతలేని ఉత్పత్తులను తయారు చేసి కంపెనీ ఆస్తులకు మరియు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారనే నెపంతో మారుతి సుజుకి యాజమాన్యం గుడ్ కండక్ట్ బాండ్‌ను తెర మీదకు తీసుకు వచ్చింది. దీనిపై కార్మికులు సంతకం చేస్తేనే ప్లాంటులోనికి అనుమతిస్తామని కంపెనీ పట్టుబట్టింది.


Click it and Unblock the Notifications








