మారుతి సుజుకి - ఫియట్‌ల ఇంజన్ సప్లయ్ డీల్ ఓకే..

ఇలా ఫియట్ నుంచి కొనుగోలు చేసిన డీజిల్ ఇంజన్‌లను మారుతి సుజుకి తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించనుంది. ప్రస్తుతం స్విఫ్ట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్ వెయింట్ పీరియడ్ అధికంగా ఉండటంతో, ఈ వేరియంట్ డెలవరీలను వేగవంతం చేసేందుకు గానూ ఫియట్‌తో మారుతి సుజుకి ఈ డీజిల్ ఇంజన్‌ల సరఫరా డీల్‌ను ఖరారు చేసింది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ జోరందుకుంది. అమ్మడవుతున్న మొత్తం కార్లలలో దాదాపు 80 శాతం డీజిల్ కార్లే ఉంటున్నాయి. ఇలా ఒక్కసారిగా డీజిల్ కార్లకు డిమాండ్ ఊపందుకోవడంతో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు డెలివరీలను అందించలేకపోతున్నాయి. కొత్త స్విఫ్ట్ బుకింగ్‌లలో దాదాపు 80 శాతం డీజిల్ వేరియంట్లే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








