దీపావళికి సందడి చేయనున్న మారుతి చిన్న కారు సెర్వో

మారుతి 800కు మరియు ఆల్టోకు మధ్యలో కంపెనీ రూపొందించిన ఓ చిన్న కారు 'సెర్వో' ఈ ఏడాదిలో దేశీయ రోడ్లపై పరుగులు తీయనుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ దీపావళి నాటికి మారుతి 'సెర్వో' టపాకాయ్ పేలనునుంది. అయితే మారుతి సెర్వో విడుదలకు సంబంధించి కంపెనీ అధికారికంగా ఓ ప్రకటన వెల్లడించాల్సి ఉంది. ఆల్టో మోడల్ ద్వారా ప్రభావితమై ఈ సెర్వో రూపొందించినట్లు తెలుస్తుంది. సెర్వో డిజైన్‌ను గమనిస్తే ఇది అర్థమవుతుంది. మారుతి సెర్వో దేశీయ మార్కెట్లో రెండు లక్షల రూపాయల కంటే తక్కువ ధర ఉండే అవాకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న టాటా నానో స్పీడుకు డిస్క్ బ్రేక్ పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








