ఏప్రిల్ నాటికి స్విఫ్ట్ బుకింగ్‌లను క్లియర్ చేయనున్న మారుతి

వచ్చే సంవత్సరం మార్చి-ఏప్రిల్ నాటికి పెండింగ్‌లో ఉన్న మొత్తం స్విఫ్ట్ బుకింగ్‌లను క్లియల్ చేయాలని మారుతి సుజుకి భావిస్తుంది. జనవరి నాటికి మానేసర్‌లోని రెండవ ప్లాంటు పూర్తిస్థాయిలో ప్రారంభించగలిగనట్లయితే, నెలకు 18,000 నుండి 20,000 స్విఫ్ట్ కార్లను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నామని మారుతి సుజుకి ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
అంటే మరో నాలుగైదు నెలల్లో కొత్త స్విఫ్ట్ బ్యాక్‌లాగ్‌లు అన్నీ క్లియర్ కానున్నాయన్నమాట. మానేసర్‌లోని రెండవ ప్లాంటులో ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లయితే, ఈ ప్లాంట్ల నుండి రోజుకు 2,100 యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం దాదాపు రోజుకు 1,400 యూనిట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








