మరో రెండు వారాల్లో కిజాషి సేల్స్ ప్రారంభం..!

Maruti Suzuki Kizashi
భారతదేశపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజికి తొలిసారిగా ప్రవేశపెట్టిన లగ్జరీ కారు మరికొద్ది రోజుల్లో రోడ్లపై దర్శనమివ్వనుంది. ఇటీవల మారుతి సుజుకి విడుదల చేసిన లగ్జరీ సెడాన్ మోడల్ కారు "కిజాషి" మరో రెండు వారాల్లో వినియోగదారుల చెంతకు చేరనుంది. ఇప్పటికే కిజాషికు 500 బుకింగ్స్ వచ్చి చేరాయని అతి త్వరలోనే ఈ కారును వినియోగదారులకు అందజేయనున్నామని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ వెల్లడించారు. భారత లగ్జరీ కార్ మార్కెట్‌కు పెరుగుతన్న డిమాండును దృష్టిలో.. ఇప్పటికే ఈ విభాగంలో రాణిస్తున్న విదేశీ కంపెనీలకు పోటీగా మారుతి సుజుకి సరికొత్త లగ్జరీ సెడాన్‌ కిజాషిను గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

టొయోటా క్యామ్రే, వోక్స్‌వ్యాగన్ జెట్టా, హోండా అకార్డ్ వంటి విదేశీ కార్లు ధీటుగా కిజాషి నిలబడగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది. మారుతి సుజుకి మాతృ సంస్థ జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఈ లగ్జరీ కారును పూర్తిగా భారతీయ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), క్రూయీజ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 10-వే సీట్ అడ్జస్ట్‌మెంట్ వంటి అత్యాధునిక సేఫ్టీ సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. మ్యాన్యువల్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి కేవలం 7.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే ఆటోమేటిక్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి 8.8 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.

అలాగే.. మ్యాన్యువల్ వెర్షన్ కిజాషి గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ...లీటరుకు 12.53 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, అలాగే ఆటోమేటిక్ వెర్షన్ కిజాషి గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ లీటరుకు 12.45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్ ధర రూ. 16.5 లక్షలు ఉండగా.. ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ మోడల్ ధర రూ. 17.5 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 16, 2011, 14:40 [IST]
English summary
Maruti Suzuki is on full swing of selling its premium sedan Kizashi very soon as already there have been 500 bookings, said the company’s Chief General Manager for Marketing. The move to roll out this car was a result of boom in the luxury car market in India and coincidentally Maruti launched this car last month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+