ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఆల్టో కారు

Maruti Suzuki
భారత్‌లోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఆల్టో రికార్డు సృష్టించిందని మారుతీ సుజుకి తెలిపింది. ఫోక్స్‌వ్యాగన్ గోల్డ్(జర్మనీ), ఫియట్ యునో, ఫోక్స్‌వ్యాగన్ గోఐ(బ్రెజిల్)లను తోసిరాజని ఆల్టో అగ్రస్థానానికి దూసుకెళ్లిందని వివరించింది.

ఈ ఘనత సాధించిన తొలి భారత కారు ఇదేనని తెలిపింది. గతేడాదిలో ఫోక్స్ వ్యాగన్ గోఐ కార్లు 2,93,738, గోల్డ్ కార్లు 2,51,078 అమ్ముడవగా, ఆల్టో కార్లు మాత్రం 3,00,956 అమ్ముడయ్యాయని పేర్కొంది. 2000 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఇప్పటిదాకా 16.68 లక్షల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయని తెలిపింది. 2005-06 ఆర్థిక సంవత్సరం నుంచి భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతోన్న కారుగా రికార్డులు సృష్టిస్తోందని పేర్కొంది. 150 రోజుల్లో లక్ష కార్లు అమ్ముడైన రికార్డును సాధించిన తమ ఆల్టో కారుకు పలు అవార్డులు కూడా లభించాయని వివరించింది.

More from DriveSpark

Article Published On: Friday, May 13, 2011, 11:17 [IST]
English summary
This month the Maruti Alto, boosted by the face lifted K10 version, sets up a new monthly volume record in India at 38,065 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+