పది లక్షల కె-సిరీస్ ఇంజన్‌ల ఉత్పత్తి అధిగమించిన మారుతి

ఈ సందర్భంగా మారుతి సుజుకి ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. తాము అందిస్తున్న తర్వాతి తరం కె-సిరీస్ ఇంజన్లకు వినియోగదారుల నుంచి వస్తున్న ప్రశంసలకు గానూ గర్వంగా భావిస్తున్నామని, మార్కెట్ లీడర్‌గా ఉండి, గడచిన సంవత్సరాలుగా తాము నిరంతరం టెక్నాలజీలను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. మొత్తం 10 లక్షల కె-సిరీస్ ఇంజన్లలో 3.5 లక్షల ఇంజన్‌లను ఏ-స్టార్ కార్లకు, 1.9 లక్షల ఇంజన్లను వ్యాగన్ఆర్ కార్లకు, 1.36 లక్షల ఇంజన్లను ఆల్టో కె10 కార్లకు, 1.05 లక్షల ఇంజన్లను ఎస్టిలో కార్లకు, 1.24 లక్షల ఇంజన్లను స్విఫ్ట్ కార్లకు మరియు 95 వేల ఇంజన్లను రిట్జ్ కార్లకు అమర్చినట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








