మారుతి ఎస్టిలో వర్సెస్ హ్యుందాయ ఐ10: ఏది బెస్ట్?

Estilo vs i10
భారత కార్ మార్కెట్లో మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీలు చిరకాల ప్రత్యర్థులన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ రెండు కంపెనీలు ఒకరికి పోటీగా మరొకరు ఉత్పత్తులను అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి అందిస్తున్న ఎస్టిలో (విఎక్స్ఐ వేరియంట్)కు, హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 (స్పోర్ట్స్ వేరియంట్)కు మధ్య ఉన్న వ్యత్యాసాలేంటో చూద్దాం.

* మారుతి ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్ కారులో యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) ఆప్షనల్‌గా లభిస్తుంది. కానీ ఐ10 స్పోర్ట్స్‌లో ఈ సదుపాయం లేదు. అత్యవసర సమయాల్లో బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు ఏర్పడే ప్రమాదాలను ఏబిఎస్ నియంత్రిస్తుంది.

* మారుతి ఎస్టిలో కారులో ఎయిర్‌బ్యాగ్స్ సెఫ్టీ ఫీచర్ ఆప్షనల్‌గా లభిస్తుంది. కానీ ఐ10 స్పోర్ట్స్‌లో ఈ సదుపాయం లేదు. అత్యవసర సమయాల్లో ఇదొక అధనపు భద్రతా ఫీచర్.

* మారుతి ఎస్టిలో మొత్తం పొడవు 3600 మి.మీ. ఐ10 స్పోర్ట్స్ పొడవు 3585 మి.మీ. దీనివలన ఎస్టిలో కారులో మరింత లెగ్‌స్పేస్ కలిగి ఉంటుంది.

* మారుతి ఎస్టిలో మొత్తం ఎత్తు 1595 మి.మీ. ఐ10 స్పోర్ట్స్ మొత్తం ఎత్తు 1550 మి.మీ. దీని వలన ఎస్టిలో కారులో కాస్తంత అధనపు హెడ్ స్పేస్ కలిగి ఉంటుంది.

* మారుతి ఎస్టిలో విఎక్స్ఐ వేరియంట్‌లో ముందువైపు ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. హ్యుందాయ్ ఐ10 స్పోర్ట్స్‌ వేరియంట్‌లో ఫాగ్ ల్యాంప్స్ ఇండవు.

* మారుతి ఎస్టిలో రిమోట్ కీ-లెస్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. కానీ ఐ10 స్పోర్ట్స్‌లో ఇది లేదు. ఇది కారు యొక్క అధనపు భద్రతకు, సౌకర్యవంతమైన లాకింగ్, అన్-లాకింగ్‌కు ఉపకరిస్తుంది.

* మారుతి ఎస్టిలో కీ రిమైండర్ సిస్టమ్ ఉంది. కానీ ఐ10 స్పోర్ట్స్‌లో ఇది లేదు. ఇది కారు యొక్క అధనపు భద్రతకు ఉపకరిస్తుంది.

* మారుతి ఎస్టిలో విఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 3.91 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఐ10 స్పోర్ట్స్ వేరియంట్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరను బట్టి చూస్తే.. ఎస్టిలో కారును కొనుగోలు చేయడం వలన రూ.50,000 నగదు బెనిఫిట్‌ను పొందవచ్చు.

ఇంకా మారుతి సుజుకి ఎస్టిలో కారులో కెబి సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. అధిక రూమ్, స్టోరేజ్ స్పేస్ కోసం వెనుకవైపు సీట్లను మడుచుకునే వీలుంటుంది (ఫోల్డబల్ రియర్ సీట్స్). ఇది స్టైలిష్ ఇంటీరియర్స్‌ను కలిగి ఉంటుంది. మారుతి ఎస్టిలో డిటెన్ పిన్ టెక్నాలజీతో కేబుల్ టైప్ గేర్ షిఫ్ట్ మెకానిజంను కలిగి ఉంటుంది. మరి మీ ఆప్షన్ ఏంటి...? మారుతి సుజుకి ఎస్టిలో కారా... లేక హ్యుందాయ్ ఐ10 స్పోర్ట్స్ కారా...!?

More from DriveSpark

Article Published On: Saturday, September 24, 2011, 12:55 [IST]
English summary
Maruti Estilo vs Hyundai i10 Sports: Which is best and why. Here is the comparison, take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+