ఐఎమ్‌ఐతో చేతులు కలిపిన మారుతి సుజుకి

ఈ ఒప్పందంలో భాగంగా.. ఐఎమ్ఐ అందిస్తున్న పార్ట్-టైమ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ మేనేజ్‌మెంట్ (పిజిడిఎమ్) ప్రోగ్రామ్‌కు ప్రతి ఏటా మారుతి సుజుకి తన ఎగ్జిక్యూటివ్‌లను స్పాన్సర్ చేస్తుంది. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఐఎల్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్ వై సిద్ధిక్వి మాట్లాడుతూ.. 'ఐఎమ్ఐతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఐఎమ్ఐలో మా ఎగ్జిక్యూటివ్‌లు ప్రపంచ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యను పొందే అవకాశం ఏర్పడింది. ఇది మారుతి సుజుకిలో భావి పరిశ్రమ నేతలను పైకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని నేను ఖచ్ఛితంగా చెప్పగలన'ని అన్నారు.


Click it and Unblock the Notifications








