కంపెనీ ఆదాయాలపై మారుతి సుజికి అంచనాలు

ఇప్పటి వరకూ తమకు మంచి డిమాండ్ ఉందని, గడచిన మూడు త్రైమాసికాల్లోనూ మారుతి ఆదాయం గణనీయమైన వృద్ధిని సాధించామని, అలాగే ప్రస్తుత త్రైమాసికంలో ఫిబ్రవరి, మార్చి నెలలను గమనిస్తామని, కానీ లాభాలు అధికంగా గాని, యథాతథంగా గానీ ఉండవచ్చునని మారుతి సుజికి ఇండియా ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేత్ పేర్కొన్నారు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజికి రూ. 30,119.77 కోట్లుగా ఉంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో కంపెనీ ఆదాయంలో 26.33 శాతం వృద్ధిని సాధించి, గతేడాదితో పోలిస్తే రూ. 21,617.65 కోట్ల నుంచి రూ. 27,310.35 కోట్లకు పెంచుకుంది.


Click it and Unblock the Notifications








