మూడో త్రైమాసికంలో 18 శాతం క్షీణించిన మారుతి లాభాలు

అంతకు ముందు సంవత్సరం (2009 డిసెంబర్ త్రైమాసికంలో) మూడవ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ. 687.53 కోట్లు ఉండగా.. 2010 మూడవ త్రైమాసికంలో నికరలాభం రూ. 565.17 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో నికర అమ్మకాలు 26.49 శాతం పెరిగాయి. 2009 మూడో త్రైమాసికంలో రూ. 7,333.77 కోట్ల విక్రయాలు జరగగా.. 2010 మూడో త్రైమాసికంలో రూ. 9,276.73 కోట్లకు పెరిగాయి.
గత 2009 క్యూ3లో 2,58,026 యూనిట్లను విక్రయించగా.. ఈ త్రైమాసికంలో అది 28.16 శాతం వృద్ధి చెంది 3,30,687 యూనిట్లకు పెరిగాయి. ఒక్క దేశీయ మార్కెట్లోనే విక్రయాలు 36.83 శాతం వృద్ధిని సాధించి 2,18,910 యూనిట్ల నుండి 2,99,527 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ కారు విక్రయాలు అధికంగా జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








