16 మంది రెగ్యులర్ వర్కర్లు సస్పెండ్, 12 మంది ట్రైనీలు ఫైర్

Job Loss
కార్మికుల విషయంలో మారుతి సుజుకి తన మొండి పట్టును వదలడంలేదు. బాండ్లపై సంతం చేస్తేనే వర్కర్లను లోనికి అనుమతించాలంటూ, మానేసర్ ప్లాంటు గేటు ఎదుగా భారీగా భద్రతా సిబ్బందిని మోహరిపంజేసింది. కాగా.. ఈ రోజు తాజాగా మారుతి సుజుకి యాజమాన్యం 16 మంది రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయగా మరో 12 మంది ట్రైనీలను విధుల్లో నుంచి తొలిగించి వేసింది.

వర్కర్లు కావాలానే నాణ్యతలేని ఉత్పత్తులను రూపొందించి కంపెనీ పేరు ప్రతిష్టలకు నష్టం చేకురుస్తున్నారనే నెపంతో సోమవారం మారుతి సుజుకి యాజమన్యం 10 మంది శాశ్వత ఉద్యోగులను సస్పెండ్ చేయగా మరో ఐదుగురిని డిస్‌మిస్ మరియు ఆరుగురు ట్రైనీలను విధుల్లో నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. గుడ్ కండక్ట్ బాండ్‌‌పై సంతకం చేస్తేనే అనుమతిస్తామని మారుతి యాజమాన్యం పట్టుబట్టింది.

మారుతి మొండి పట్టు కారణంగా హర్యానాలోని మానేసర్ ప్లాంటులో రెండో రోజు కూడా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గడచిన జూన్ నెలలో మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను కంపెనీ యాజమాన్యం గుర్తించాలంటూ 13 రోజుల పాటు సమ్మె చేసిన విషయం విదితమే.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2011, 15:11 [IST]
English summary
Maruti Suzuki India (MSI) continues to take stringent action against erring workers at Manesar. The Indian carmaker has suspended 16 more permanent workers and dismissed 12 trainees even as the tussle between the management and workers showing signs of escalation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+