ఫియట్ నుంచి డీజిల్ ఇంజన్‌లను కొనుగోలు చేయనున్న మారుతి!

మరి డీజిల్ ఇంజన్‌లను ఫియట్ నుంచి కొనుగోలు చేయనున్నారా అనే ప్రశ్నకు ఆయన భావర్థకంగా సమాధానిమిస్తూ.. "ప్రస్తుతం, మేము ఈ అంశాన్ని (ఫియట్ నుంచి డీజిల్ ఇంజన్‌లను కొనుగోలు చేసే అంశాన్ని) పరిశీలిస్తున్నాం, ఇద పూర్తి కావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చున"ని అన్నారు. అంతకు మించి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
సాధారణంగా పెట్రోల్ ఇంజన్‌ల ఉత్పత్తి కన్నా డీజిల్ ఇంజన్‌ల ఉత్పత్తి కాస్తంత వ్యయంతో కూడుకున్నది. దీనికి తోడు భారత్‌లో ఒక్కసారిగా డీజిల్ కార్లకు డిమాండ్ ఊపందుకోవడమతో కంపెనీ హంగేరీకు కూడా ఇంజన్‌ల ఎగుమతిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్విఫ్ట్ డిజైర్, రిట్జ్, ఎస్ఎక్స్-4 మోడళ్లకు ఫియట్ లైసెన్స్ కింద మారుతి 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌లను ఉత్పత్తి చేస్తోంది.


Click it and Unblock the Notifications








