డీజిల్ కార్ల ధరలను రూ.10,000 మేర పెంచిన మారుతి

ఈ తాజా పెంపుతో మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ మోడల్ రిట్జ్ డీజిల్ వేరియంట్ ధర రూ.2,000 పెరిగింది. అలాగే, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఎస్‌ఎక్స్4 మోడళ్ల డీజిల్ వేరియంట్ల ధరలు కూడా రూ.10,000 వరకూ పెరిగాయి. ధరలు పెరగకముందు డీజిల్ వెర్షన్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4.93 లక్షల నుంచి రూ.5.29 లక్షల మధ్య ఉంది. ఇకపోతే మారుతి సుజుకి స్విఫ్ట్ రూ.5.17 లక్షల నుంచి 6.38 లక్షలు, స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ధర రూ.5.86 లక్షల నుంచి రూ.7.20 లక్షలు, ఎస్ఎక్స్4 సెడాన్ ధరలు రూ.7.79 లక్షల నుంచి రూ.9.01 లక్షల మధ్యలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








