ఏడవ ప్లాంటు ఏర్పాటుపై కన్నేసిన మారుతి సుజుకి

ప్రస్తుతం మానేసర్‌లో రూ. 3,625 కోట్ల పెట్టుబడితో మారుతి రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మానేసర్‌లో ప్రస్తుతం ఉన్న ప్లాంటు ఉత్పత్తి సామర్ధ్యం సాలీనా 3,50,000 యూనిట్లుగా ఉంటే.. గుర్గావ్‌లో ఉన్న మూడు ప్లాంట్ల ద్వారా సాలీనా 8,50,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. 2015-16 నాటికి ప్యాసింజర్ వాహన మార్కెట్ 50 లక్షల యూనిట్లకు పెరుగుతుందని, తమ మార్కెట్ వాటాను సాధ్యమైనంత గరిష్టంగా ఉంచుకోవాలని భావిస్తున్నామని, అందుకోసం ఏటా 25 లక్షల యూనిట్ల నుంచి 30 లక్షల యూనిట్ల మధ్యలో వాహనాలను విక్రయిస్తామని మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు.


Click it and Unblock the Notifications








