కోటి కార్ల ఉత్పత్తి మార్కును అధిగమించనున్న మారుతి

Maruti 800
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మరో అరుదైన మైలురాయిని అధిగమించనుంది. ఎమ్800 ద్వారా దాదాపు 27 ఏళ్ల క్రితం కార్ల తయారీని ప్రారంభించిన మారుతి సుజుకి కోటి కార్ల ఉత్పత్తి మార్కును తాకేందుకు అతి చేరువలో ఉంది. మార్చి 15, 2011 నాటికి కంపెనీ కార్ల ఉత్పత్తి ఈ మైలురాయిని అధిగమించవచ్చు. గుర్గావ్ ప్లాంటు నుంచి కార్యకలాపాలను ప్రారంభించిన మారుతి సుజుకి ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరించి దేశీయ కార్ మార్కెట్‌ను శాసిస్తోంది. మధ్యతరగతి వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకూ అన్ని విభాగాల్లోను మారుతి తనదైన ముద్రను వేసుకుంది.

అంతేకాకుండా.. రానున్న 6-7 ఏళ్లలో వరుసగా రెండోసారి కూడా కోటి వాహనాల ఉత్పత్తి మార్కును సాధించగలమని మారుతి సుజుకి అంచనా వేస్తోంది. మనేసర్‌లో కంపెనీ నిర్మిస్తున్న రెండు కొత్త ప్లాంట్ల ద్వారా ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్ఎస్ఐ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ప్లాంట్ల నిర్మాణం కోసం 3,625 కోట్ల రూపాయలను కంపెనీ పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఈ రెండు ప్లాంట్ల ద్వారా వార్షికంగా ఐదు లక్షల కార్లను మారుతి ఉత్పత్తి చేయనుంది. ఎమ్ఎస్ఐలో జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్‌కు 54.2 శాతం వాటా ఉంది. ప్రస్తుతం గుర్గావ్‌ ప్లాంట్‌లో వార్షికంగా 8.5 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తుండగా.. మనేసర్‌ ప్లాంటులో 3.5 లక్షల కార్ల ఉత్పత్తిని సాధిస్తోంది.

అక్టోబర్ 2010 నుండి కంపెనీ ఉత్పత్తి ఏటా 10 శాతం (లక్ష కార్లకు పైగా) పెరుగుతూ వచ్చిందని, 2011-12 నాటికి ఇది వార్షికంగా 14 లక్షల యూనిట్లను తాకుతుందని కంపెనీ వివరించింది. డిసెంబర్‌ 14, 1983న తొలి ఎమ్800 కారును ఉత్పత్తిని ప్రారంభించిన మారుతి సుజుకి వచ్చే వారం నాటికి కోటి కార్లను ఉత్పత్తి మార్కును దాటనుంది. కోటి కార్ల ఉత్పత్తి మార్కును అధిగమించడం కేవలం ఒక మైలురాయి మాత్రమేనని, కానీ.. అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా మొట్టమదటి కారును స్వీకరించడం తన జీవితంలో మరిచిపోలేని మధుర క్షణాలని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ తెలిపారు. ప్రతి ఏటా 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడం కూడా ఓ పెద్ద మైలురాయేనని ఆయన వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Monday, March 14, 2011, 10:43 [IST]
English summary
The country's largest carmaker Maruti Suzuki India today said it expects to achieve the feat of producing a crore vehicle for the second time in the next 6-7 years with the opening of its two new plants at Manesar. The company is likely to cross the milestone of producing the first one crore vehicles since its inception on March 15, nearly 27 years since it first rolled out M800 from Gurgaon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+