మారుతి కిజాషి ప్రచారానికి రూ. 8 కోట్లు..!?

ఈ మొత్తంలో దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల మేరకు ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో మారుతి టెలివిజన్ వాణిజ్య ప్రకనలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మారుతి సుజికి ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ ముందు ప్రస్తావించగా... ఈ ప్రచారానికి ఎంత మొత్తం ఖర్చు చేస్తారనే విషయంపై స్పందించడానికి నిరాకరించారు. అయితే వచ్చే వారం నుంచి టీవీలలో వాణిజ్య ప్రకటనలు వస్తాయని మాత్రం స్పష్టం చేశారు.
కిజాషి ప్రకటన మార్చి 8 నుంచి ప్రపంచ కప్ కిక్రెట్ మ్యాచ్ సమయంలో టీవీలలో ప్రసారమవుతుందని, ఇది పూర్తిగా కిజాషి ప్రత్యేకతలు, విలాసాలు వంటి పలు ఫీచర్లపై రూపొందించబడినదని, ఈ ప్రకటనలో ఎలాంటి స్టోరీలైన్ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన చిత్రీకరణ కోసం ప్రత్యేంగా ఫాంటమ్ కెమెరాను ఉపయోగించామని, సెకనుకు 2,000 ఫ్రేమ్‌లు ఈ చిత్రీకరించే ఈ కెమెరాతో మంచి విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేలా శ్రద్ధ తీసుకున్నామని శ్రీవాత్సవ వివరించారు.


Click it and Unblock the Notifications








