కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్‌ను లాంచ్ చేయనున్న మారుతి!

ఎక్సైజ్ సుంఖంలో రాయితీలను పొందేందుకు గానూ నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండేలా ఓ సరికొత్త కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ కారును మారుతి సుజుకి అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో 2012లో కంపెనీ ఈ కారును ప్రదర్శించనుంది.
అయితే, ప్రస్తుతం మానేసర్ ప్లాంటులో నెలకొన్న కార్మిక అనిశ్చితి కారణంగా కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్‌ను కంపెనీ ఆవిష్కరించినప్పటికీ, ఇది ఉత్పత్తి దశకు చేరుకోవడానికి మరికాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ కాంపాక్ట్ సెడాన్ పొడవులో 3.99 మీటర్లు ఉండనుంది. దీని ధర నాలుగు లక్షలకు ఎగువన ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








