లగ్జరీ కారు 'కిజాషి'ను భారత మార్కెట్లో విడుదల చేసిన మారుతి

విదేశీకార్ల పట్ల ఆసక్తి చూపే వారి కోసం కిజాషి కారును ప్రవేశపెట్టామని చేసుకున్నామని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సింజో నకానిషి తెలిపారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), క్రూయీజ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 10-వే సీట్ అడ్జస్ట్‌మెంట్ వంటి అత్యాధునిక సేఫ్టీ సదుపాయాలు కిజాషిలో ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మ్యాన్యువల్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి కేవలం 7.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే ఆటోమేటిక్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి 8.8 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.
ఇకపోతే మ్యాన్యువల్ వెర్షన్ కిజాషి గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ...లీటరుకు 12.53 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, అలాగే ఆటోమేటిక్ వెర్షన్ కిజాషి గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ లీటరుకు 12.45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కిజాషి కారుకు ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభించామని, ఈ ఏడాది మార్చి నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. హోండా అకార్డ్, వోల్క్స్‌వ్యాగన్ జెట్టా, స్కొడా లారా వంటి లగ్జరీ కార్లకు మారుతి కిజాషి గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ భావిస్తోంది. ప్రతి ఏడాది ఓ కొత్త మోడల్ కారును విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, ఈ ఏడాది కొత్త స్విఫ్ట్‌ను, ఎస్ఎక్స్4 డీజిల్ వేరియంట్‌ను విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








