ఇయాన్‌కు ధీటుగా లిమిటెడ్ ఎడిషన్ మారుతి ఆల్టో ఎక్స్‌ప్లోర్

మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కారు అయిన ఆల్టోలో 'ఆల్టో ఎక్స్‌ప్లోర్' అనే సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను నేడు కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ఆల్టో కన్నా మరిన్ని అధనపు ఫీచర్లను జోడించి హ్యుందాయ్ ఇయాన్‌ను ధీటుగా ఎదుర్కునేలా మారుతి ఈ లిమిటెడ్ ఎడిషన్ ఆల్టోను రూపొందించింది. ఆల్టో టాప్-ఎండ్ వేరియంట్‌లైన ఆల్టో ఎల్ఎక్స్ఐ, ఆల్టో-కె10 విఎక్స్ఐలో ఈ లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది. ఆల్టో ఎక్స్‌ప్లోర్ ఆరు ఆకర్షనీమైన రంగుల్లో లభ్యమవుతుంది.
లిమిటెడ్ ఎడిషన్ ఆల్టో ఎక్స్‌ప్లోర్ మోడల్‌లో యూఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డబుల్-డిన్ స్టీరియో సిస్టమ్, లెథర్ సీట్స్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, బాడీ రంగులోనే ఉండే బంపర్స్, సైడ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్, రూఫ్ రెయిల్స్ వంటి అధనపు ఫీచర్లను జోడించారు. అయితే దీని ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








