మారుతి లిమిటెడ్ ఎడిషన్ ఆల్టో ఎక్స్‌ప్లోర్ ఫీచర్లు, ధరలు

మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఆల్టో మోడల్‌లో 'ఆల్టో ఎక్స్‌ప్లోర్' అనే సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను హ్యుందాయ్ ఇయాన్ విడుదలైన రోజునే (అక్టోబర్ 13, 2011) విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆల్టో కారుకు మరిన్ని అదనపు హంగులు జోడించి కంపెనీ ఈ ఆల్టో ఎక్స్‌ప్లోర్‌ను ప్రవేశపెట్టింది. ఆల్టో ఎక్స్‌ప్లోర్‌లో మారుతి సుజుకి అదనంగా అందిస్తున్న ఫీచర్లను పరిశీలిస్తే..
ఆల్టో ఎక్స్‌ప్లోర్ మోడల్‌లో అదనపు ఫీచర్లు:
* లెథర్ సీట్లు
* యూఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డబుల్-డిన్ స్టీరియో సిస్టమ్
* స్పోర్టీ రియర్ స్పాయిలర్
* సరికొత్త బాడీ గ్రాఫిక్స్
* కారు బాడీ రంగులోనే ఉండే బంపర్స్
* బాడీ కలర్డ్ రియర్ వ్యూ సైడ్ మిర్రర్స్
* బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్
* స్టైలిష్ డోర్ స్టిల్ గార్డ్
* మడ్ ఫ్లాప్ సెట్
* యూనివర్సెల్ కార్పెట్ మ్యాట్
ఎక్రు బీగీ, సుపీరియర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, ఫైర్ బ్రిక్ రెడ్, బ్లూ బ్లేజ్ మరియు సిల్కీ సిల్వర్ అనే ఆరు ఆకర్షనీమైన రంగుల్లో ఆల్టో ఎక్స్‌ప్లోర్ లభ్యమవుతుంది. ఈ అదనపు ఫీచర్లన్నింటినీ కలిపితే సుమారు రూ.30,000 వరకూ వెల చేస్తాయి. కాగా.. మారుతి సుజుకి ఆల్టో కె10 సిరీస్‌లో ఆల్టో ఎక్స్‌ప్లోర్ లిమిటెడ్ ఎడిషన్ రెండు వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది. దీని ధరలు ఈ విధంగా ఉన్నాయి.
మారుతి ఆల్టో ఎక్స్‌ప్లోర్ (ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ) రూ.2.81 లక్షలు
మారుతి ఆల్టో ఎక్స్‌ప్లోర్ (ఆల్టో కె10 విఎక్స్ఐ) రూ.3.71 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ ముంబై)


Click it and Unblock the Notifications








