గుజరాత్‌లోనే కొత్త ప్లాంటును ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతున్న మారుతి

మరోవైపు గుజరాత్ ఇప్పటికే జనరల్ మోటార్స్ (హలోల్ ప్లాంటు), టాటా మోటార్స్ (సనంద్ ప్లాంటు) వంటి పెద్ద పెద్ద ఆటో దిగ్గజాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఎగుమతులను లక్ష్యంగా చేసుకొని మారుతి కొత్త ప్లాంటును అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్విఫ్ట్, ఎస్టిలో, ఏ-స్టార్ కార్లను మారుతి ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం ఈ మోడళ్లు ముంద్రా పోర్ట్ ద్వారా యూరప్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2015-16 నాటికి సాలీనా 30 లక్షల వాహనాలను అమ్మాలనే లక్ష్యంతో మారుతి విస్తరణ ప్రణాళికలను రూపొందిస్తుంది. మానేసర్‌లో ప్రస్తుతం ఉన్న ప్లాంటు ఉత్పత్తి సామర్ధ్యం సాలీనా 3,50,000 యూనిట్లుగా ఉంటే.. గుర్గావ్‌లో ఉన్న మూడు ప్లాంట్ల ద్వారా సాలీనా 8,50,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








