దికొచ్చిన కార్మికులు: మానేసర్ ప్లాంటులో ముగిసిన సమ్మె

కార్మికుల డిమాండ్ మేరకు తొలగించిన 18 మంది ట్రైనీలకు తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కూడా కంపనీ అంగీకరించింది. గడచిన ఆగస్టు 29న మానేసర్ ప్లాంటులో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య గుడ్‌కండక్ట్ బాండ్ విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. నెలరోజులకు పైగా సాగిన ఈ సమ్మె నేటితో సద్దుమణగడంతో ఇటు డీలర్లు, అటు కొత్త స్విఫ్ట్ కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు.
కార్మికుల సమ్మె విరమణతో మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి వేగవంతం కానుంది. సోమవారం (అక్టోబర్ 3, 2011) నుండి ఈ ప్లాంటులో పనులు యాధావిథిగా పునఃప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమ్మె కారణంగా మారుతి సుజుకి ఎంత మేర నష్టపోయిందనే విషయాన్ని కంపెనీ వెల్లడించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








