మానేసర్ ప్లాంటులో మరోసారి సమ్మెకు దిగిన కార్మికులు

ఈ విషయంపై కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా.. "నిన్న మా సూపర్‌వైజర్లలో ఒకరిపై వర్కర్లు దాడి చేసినందుకు గానూ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు నేడు ప్రయత్నించగా వారు ప్లాంటులో పనులకు అంతరాయం కలిగించారు. అయితే, ఈసారి సమ్మెకు దిగిన వర్కర్ల సంఖ్య తక్కువ"ని ఆయన తెలిపారు.
సస్పెండ్ చేయబడిన ఐదుగురు వర్కర్లకు యాజమాన్యం షోకాజ్ నోటీస్‌లు పంపించినట్లు తెలుస్తోంది. అయితే, వర్కర్లు మాత్రం పూర్తిస్థాయిలో సమ్మె చేసినట్లు తెలియడం లేదు. తమ సహోద్యోగులను పోలీసులు బలవంతంగా గెంటి వేయడంతో ఆందోళన దిగిన వర్కర్లు ఒక గంట పాటు టూల్-డౌన్ నిర్వహించినట్లు ఓ కార్మికుడు తెలిపాడు.
వారిలో మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్‌ఈయూ)కు చెందిన ముగ్గురు ఆఫీస్ బేరర్లతో పాటు జనరల్ సెక్రటరీ శివ్ కుమార్ కూడా ఉన్నట్లు సమాచారం. ప్లాంటులో ఏర్పడిన ఈ అంతరాయం కారణంగా దాదాపు 50 యూనిట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లి ఉండవచ్చునని అంచనా.
గత నెల ఆరంభంలో మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన తమ యూనియన్‌ను గుర్తించాలంటూ వర్కర్లు జూన్ 4వ తేదీ నుంచి 13 రోజుల పాటు నిరవధికంగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా కంపెనీ దాదాపు రూ. 630 కోట్లను నష్టపోయింది. మరి ప్లాంటులో నెలకొన్న తాజా పరిణామాలు ఏ పరిస్థితికి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








