మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల రిక్రూట్‌మెంట్

పర్మినెంట్ ఉద్యోగుల స్థానే కొత్త వారిని పర్మినెంట్ చేస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. ఆగస్టు 29వ తేదీ నుంచి మనేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్గి కుండిపడిపోయింది. యాజమాన్యం కార్మికులు ప్లాంట్‌లోకి వెళ్లడానికి నిరాకరిస్తోంది. కొంత మంది కార్మికులు పనివిషయంలో విచక్షణా రహితంగా పనిచేస్తూ క్వాలిటీ విషయంలో శ్రద్ధచూపడం లేదని యాజ మాన్యం ఆరోపిస్తోంది. దీంతో యాజమాన్యం కార్మికులు గుడ్ కాండెక్ట్ బాండ్‌పై సంతకం చేస్తేనే ప్లాంట్‌లోకి అడుగుపెట్టని స్తామని ప్రకటించింది.
ఈ బాండ్‌లో తాము పనిలో అశ్రద్ధ చూపమని, మధ్యలోపని ఆపేయమని, సమ్మెకు దూరంగా ఉంటామని, వర్క్ టూ రూల్ పాటిస్తామని, కంపెనీ ప్రయోజనా లకు భంగం వాటిల్లే పనులు చేమని ఆ బాండ్‌లో నిబంధనలు న్నాయి. ఇప్పటి వరకు కేవలం 81 మంది కార్మకులు సంతకాలు పెట్టి పనిలో చేరారు. మెజారిటీ కార్మకులు బాండ్‌పై సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారు. మనేసర్ ప్లాంట్‌లో మొత్తం 2,500 మంది పనిచేస్తున్నారు. వారిలో 1,000 మంది పర్మినెంట్ ఉద్యోగులున్నారు. మారుతి సుజుకి మాతృసంస్థ సుజుకీ మారుతికార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) కూడా మారుతి సుజుకీ తన సంఘీభావం తెలిపింది. క్రమశిక్షణలో రాజీపడే ప్రశ్నేలేదని చైర్మన్ ఒసాము సుజుకీ తెలిపారు. క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదే జపాన్ అయినా భారత్ అయినా ఒక్కటేనని సుజుకీ తెలిపారు.


Click it and Unblock the Notifications








