ఏడో ప్లాంటు ఏర్పాటుపై గుజరాత్‌ సీఎంతో ఎమ్ఎస్ఐ భేటి!

Maruti Plant
దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) గూజరాత్‌లోని టాటా మోటార్స్ నానో ప్లాంటు సరసన తమ ఏడో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షింజోకనిషి నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడిని కలసి స్థల విషయంపై చర్చించి ఓ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఒప్పందంపై చర్చించేందుకు మారుతి ఎండి, ముఖ్యమంత్రుల మధ్య ఏదైనా సమావేశం జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు గుజరాత్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇండస్ట్రీస్ & మైన్స్) మహేశ్వర్ సాహు సమాధానమిస్తూ.. 'అవును ముఖ్యమంత్రిని మారుతు సుజుకి ఎండి కలవనున్నార'ని చెప్పారు.

గుజరాత్ ప్రభుత్వంతో ఈ ఒప్పందం గనుక ఖరారైతే ఇది హర్యానా రాష్ట్రానికి వెలుపల వైపు మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) వెచ్చిస్తున్న తొలి అతిపెద్ద పెట్టు బడికానుంది. 1983 నుంచి మారుతి హర్యానాలో కార్యకలాపాను కొనాసగిస్తుంది. అయితే అంతుకుమించి వివరాలను వెల్లడించేందుకు మాత్రం సాహు నిరాకరించారు. మోడీతో జరగనున్న ఈ భేటీలో నకనిషితో పాటుగా కంపెనీ ఛైర్మన్ ఆర్ సి భార్గవ మరియు మారుతికి చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ భేటీ విజయవంతమైతే ఏడో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి కంపెనీ ఓ అధికారిక ప్రకటన వెలువరించే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 31, 2011, 12:33 [IST]
English summary
India's largest car maker Maruti Suzuki India's (MSI) Managing Director Shinzo Nakanishi will meet Gujarat Chief Minister Narendra Modi today and he will discuss the possibly of finalise a deal to set up its 7th manufacturing plant in the state, a senior government official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+