మరిన్ని సిఎన్‌జీ వేరియంట్లుగా ప్రవేశపెట్టనున్న మారుతి

Maruti Alto CNG
ఇప్పటికే మారుతి సుజుకి అందిస్తున్న ఐదు సిఎన్‌జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) వేరియంట్ కార్లు విజయం సాధించడంతో, ఇకపై అన్ని మోడళ్ల కార్లలో సిఎన్‌జీ వేరియంట్లను ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. న్యూఢిల్లో భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమం అనంతరం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. సిఎన్‌జీ మోడళ్లపై దృష్టి సారించామని, ఈ ఫ్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే ఐధు మోడళ్లను ప్రవేశపెట్టామని, తమ ఇతర అన్ని మోడళ్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రెండు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్) అయిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం "గ్రాండ్ విటారా", మరియు లగ్జరీ సెడాన్ కారు "కిజాషి" కాకుండా మొత్తం 11 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మూడు చిన్న కార్లు ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో మోడళ్లు అలాగే.. మల్టీ యుటిలిటీ వాహనం ఈకో మరియు సెడాన్ కారు ఎస్ఎక్స్4లు సిఎన్‌జీ ఆప్షన్‌తో లభిస్తున్నాయి. ఈ మోడళ్ల విక్రయాలలో సిఎన్‌జీ వేరియంట్లు పది శాతం వాటాను కలిగి ఉన్నాయి. లీటరు పెట్రోల్ రూ. 62, లీటరు డీజిల్ రూ. 40 రూపాయలు ఉండగా సిఎన్‌జీ కేజీ ధర రూ. 29.30గా ఉంది. మరిన్ని రాష్ట్రాలలో ఈ సిఎన్‌జీ కార్లను విడుదల చేసేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 30, 2011, 16:56 [IST]
English summary
Country's largest car maker, Maruti Suzuki India Ltd (MSIL), is mulling a CNG platform for all its models. Speaking at the sidelines of the Society of Indian Automobile Manufacturers’ conference here, Alok Jaitley, general manager, homologation-environment planning, MSIL, said: “We are working on CNG models. We have already launched five vehicles on this platform and eventually plan to offer all our models on a CNG platform.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+