మానేసర్‌లో కేవలం 200 కార్లను ఉత్పత్తి చేసిన మారుతి

దీని ఫలితంగా సోమవారం నాడు కూడా మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి పాక్షికంగానే జరిగింది. మానేసర్‌లోని రెండో ప్లాంటును ప్రారంభించినప్పటికీ కార్మకుల కొరత కారణంగా సోమవారం కేవలం 200 కార్లను మాత్రమే ఉత్పత్తి చేసినట్లు మారుతి సుజుకి పేర్కొంది. వాస్తవానికి మానేసర్‌లోని ప్లాంటు బి (రెండో ప్లాంటు) ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెలారంభంలో కానీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, కార్మిక సమస్య కారణంగా దీన్ని అనుకున్నదానికంటే ముందుగానే ప్రారంభించింది.
ప్రస్తుతం మానేసర్‌లో గుర్గాన్ నుంచి వచ్చిన 40 మంది ఇంజనీర్లు, 430 మంది ఐటిఐ ట్రైనీ ఆపరేటర్లు, దాదాపు 290 మంది సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారు. వీరి ద్వారా రోజుకు 840 యూనిట్ల వరకూ ఉత్పత్తిని సాధించగలమని కంపెనీ పేర్కొంది. ఆగస్టు 29 నుండి మానేసర్ కార్మికులను మారుతి యాజమాన్యం ప్లాంటులోనికి అనుమతించడం లేదు. ఈ ప్లాంటులో కంపెనీ కొత్తగా విడుదల చేసిన హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ స్విఫ్ట్, సెడాన్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్ మరియు ఎస్ఎక్స్4 కార్లు తయారవుతాయి.


Click it and Unblock the Notifications








