రోజుకు 500 స్విఫ్ట్ కార్ల ఉత్పత్తి: మారుతి సుజుకి

గడచిన వారం రోజుల క్రితం రోజుకు 150-200 స్విఫ్ట్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేసిన మానేసర్ ప్లాంటులో ఇప్పుడు రోజుకు 500 కార్లకపైగా ఉత్పత్తిని సాధిస్తున్నామని మారుతి సుజుకి తెలిపింది. ప్రస్తుతం కొత్త స్విఫ్ట్ కారు కోసం సుమారు 90,000 లకు పైగా యూనిట్లు బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమ్మె కారణంగా కొందరు మారుతి సుజుకి డీలర్లు కొత్త బుకింగ్‌లను తీసుకోవడం నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో మారుతి సుజుకి మానేసర్ ప్లాంటు కోసం కొత్తగా కార్మికులను నియమించుకునేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. సోమవారం కొత్తగా 50 మంది కార్మికులను, మంగళవారం మరో 100 మంది కార్మికులను నియామకం చేసుకుంది. సత్‌ప్రవర్తన బాండ్‌పై సంతకాలు చేయని శాశ్వత కార్మికుల స్థానంలో కొత్తగా శాశ్వత కార్మికులను తీసుకుంటున్నామని మారుతి తెలిపింది.
ప్రస్తుతం మానేసర్, గుర్గావ్ ప్లాంట్ల సహాయంతో రోజుకు 500 స్విఫ్ట్ కార్లను తయారు చేస్తున్నామని, అలాగే ఒక్క నెలకు 12,500 స్విఫ్ట్ కార్లను ఉత్పత్తి చేస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








