దీపావళికి సందడి చేయనున్న మారుతి కొత్త కార్లు!

Maruti RIII
దేశీపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తొలిసారిగా భారత మార్కెట్లో ఓ మల్టీ పర్పస్ వాహనం (ఎమ్‌పీవీ) 'మారుతి ఆర్3' (Maruti RIII)ని విడుదల చేయనుంది. ప్రస్తుతం కంపెనీ ఈ కారును ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. గతేడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో2010లో మారుతి సుజుకి తమ ఎమ్‌పీవీ ఆర్3ను పరిచయం చేసింది. ఇప్పటి వరకూ సెడాన్, హ్యాచ్‌బ్యాక్, లగ్జరీ వంటి సెగ్మెంట్లలో కార్లను అందిస్తున్న మారుతి సుజుకి ఇలా ఓ ఎమ్‌పీవీను భారత మార్కెట్ కోసం రూపొందించడం ఇదే ప్రప్రథమం. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే ప్రపంచపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ టొయోటా అందిస్తున్న ఎమ్‌పీవీ 'ఇన్నోవా'కు ఈ మోడల్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ప్రపంచపు నెంబర్ వన్ బ్రాండ్‌తో భారతదేశపు నెంబర్ వన్ బ్రాండ్ తలపడనుంద్ననమాట.

మారుతి ఆర్3 ఎమ్‌పీవీ 1248 సీసీ డిడిఐఎస్ డీజిల్ ఇంజన్‌తో గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 20.5 కిలోగ్రామలు టార్క్‌ను విడుదల చేయనుంది. డీజిల్ వెర్షన్ విడుదల అనంతరం ఇందులో పెట్రోల్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. పెట్రోల్ వేరియంట్ మారుతి ఆర్3లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఇంజన్ అయిన కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చునని సమాచారం. ఇక మన మార్కెట్లో దీని ధర సుమారు రూ. 7 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మారుతి తన కొత్త ఎమ్‌పీవీను ఈ పండుగ సీజన్‌లో విడుదల చేయవచ్చునని తెలుస్తోంది. మరోవైపు కంపెనీ అందిస్తున్న స్విఫ్ట్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కూడా ఈ దీపావళి పండుగ సీజన్‌లో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Saturday, July 9, 2011, 16:47 [IST]
English summary
India's largest car maker Maruti Suzuki's first MPV (multi purpose vehicle) Maruti RIII, is speculated to hit the Indian roads within the near future as the car was recently spotted testing on the Indian roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+