గుర్గావ్ ప్లాంటులో స్విఫ్ట్ డిజైర్‌ను ఉత్పత్తి చేయనున్న మారుతి

Swift DZire
మారుతి సుజుకి అందిస్తున్న ఇండియాస్ లార్జెస్ట్-సెల్లింగ్ సెడాన్ 'స్విఫ్ట్ డిజైర్' మోడల్‌ను గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను మారుతి సుజుకి హర్యానాలోని మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ప్లాంటులో ఇటీవల జరిగిన సమ్మె కారణంగా స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ఉత్పత్తి నిలిచిపోయింది. మార్కెట్లో ఈ మోడల్‌కు భారీ ఉండటం, డిమాండుకు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో కంపెనీ ఉత్పత్తి షెడ్యూల్‌లో మార్పులు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ ఉత్పత్తి ప్రణాళికలో కొన్ని మార్పులు ఉన్నాయని, ఇందులో స్విఫ్ట్ డిజైర్ ఉత్పత్తిని మానేసర్ నుంచి గుర్గావ్‌ ప్లాంటుకు మార్చనున్నామని, వచ్చే వారం నుంచి దీన్ని అమలు చేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ మాత్రం యథావిధిగా మానేసర్ ప్లాంటులోనే ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. గత నెలలో మానేసర్ ప్లాంటులో కార్మికులు కొత్తగా ఏర్పాటు చేసిన యూనియన్‌ను యాజమాన్యం గుర్తించాలంటూ మానేసర్ కార్మికులు 13 రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2011, 11:54 [IST]
English summary
India's largest car maker Maruti Suzuki India (MSI) will shift production of Country's largest-selling sedan, Swift DZire from Manesar plant to its Gurgaon facility, said a company spokesman.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+