మానేసర్ రెండో ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభానికి మారుతి కసరత్తు

అయితే, ప్రస్తుత మానేసర్‌లో నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ తన ఉత్పత్తి సమార్థ్యాన్ని పెంచుకునేందుకు రెండో ప్లాంటులో కూడా వాణిజ్యపరంగా ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయించింది. మరో రెండు-మూడు రోజుల్లో ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ అధికారు ఒకరు వెల్లడించారు.
ప్రస్తుతం మానేసర్ ప్లాంటులో కొందరు కాంట్రాక్ట్ వర్కర్లు మరియు గుర్గావ్‌కు చెందిన ఇంజనీర్ల ఆధ్వర్యంలో పాక్షికంగా ఉత్పత్తి కొనసాగుతుంది. గుడ్ కండక్ట్ బాండ్‌పై సంతకం చేస్తేనే వర్కర్లను లోనికి అనుమతిస్తామని మారుతి యాజమాన్యం పట్టుబట్టడంతో గత నాలుగు రోజులుగా మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది.
ఈ ప్లాంటులో ప్రతిరోజు సగటున 1,200 యూనిట్లు ఉత్పత్తి అవుతాయి. ఈ విషయంపై కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ, రెండో ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించేందుకు తన ఇంజనీర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, ఇప్పటికే మానవశక్తి (మ్యాన్‌పవర్) తక్కువగా ఉన్న తమకు కొత్త ప్లాంటు ప్రారంభం మరింత క్లిష్టతతో కూడుకున్నదని ఆయన అన్నారు.
మానేసర్ మొదటి ప్లాంటులో కొందరు కార్మికులు కావాలనే ఉత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తూ కంపెనీ ఆస్తులకు, పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ మారుతి సుజుకి కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేయగా మరికొందరు ట్రైనీలను విధుల్లోంచి తొలగించింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు కొత్త యూనిట్‌ను అతి త్వరలోనే ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








