మారుతి సుజుకి మానేసర్, గుర్గావ్ ప్లాంట్ల మూసివేత!!

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎమ్ఎస్‌ఐ) ఎంప్లాయిస్ యూనియన్‌కు కూడా హర్‌జిత్ గ్రోవర్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. మేనేసర్ ప్లాంటులో మారుతి వర్కర్లు చేస్తున్న నేటితో ఏడవ రోజుకు చేరుకుంది. నిన్నటి వరకూ కంపెనీ దాదాపు 5,400 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయినట్లు అంచనా, దీని విలువ సుమారు రూ. 270 కోట్లు. సమ్మె పరిష్కారానికి అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని హర్యానా పరిశ్రమల శాఖ మంత్రి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు.
మారుతి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ గురావారం గుర్గావ్-మానేసర్ బెల్ట్‌లోని వివిధ కంపెనీలకు చెందిన వెయ్యి మందికి పైగా కార్మికులు మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ గేట్ వద్ద బైఠాయించారు, హీరో హోండా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, రికో ఆటో కంపెనీలకు చెందిన కార్మిక సంఘ సభ్యులు, ఇతర ట్రేడ్ యూనియన్ల నుంచి ఎంపిక చేసిన సభ్యులతో ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశామని హర్‌జిత్ గ్రోవర్ వెల్లడించారు. మరోవైపు వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగా ఈనెల 20 నుంచి 25 వరకూ మానేసర్, గుర్గావ్ ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.


Click it and Unblock the Notifications








