నేటితో నెల రోజులకు చేరిన మానేసర్ కార్మికుల సమ్మె

గడచిన నెల సరిగ్గా ఇదే సమయానికి (ఆగస్ట్ 29, 2011) మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో సమ్మె ప్రారంభమైంది. కార్మికులు కావాలనే ఉత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తున్నారని మారుతి యాజమాన్యం గుడ్‌కండక్ట్ బాండ్‌ను తెర మీదకు తీసుకువచ్చింది. ఈ బాండుపై సంతకం చేసిన వారిని మాత్రమే ప్లాంటు లోనికి అనుమతిస్తామనే షరతును విధించింది. ఈ నేపథ్యంలో అటు యాజమాన్యానికి, ఇటు కార్మికులకు మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోతున్నాయి.
సమ్మె విరమణకు సంబంధించి ఇరు వర్గాల మధ్య తాజాగా జరిపిన సంప్రదింపులు కూడా విఫలమయ్యాయి. కొత్త వర్కర్ల ద్వారా మానేసర్ ప్లాంటులో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని వేగవంతం చేసిన కంపెనీ తాజాగా ఈ ప్లాంటులో ఎస్ఎక్స్4, ఏ-స్టార్ మోడళ్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ప్రస్తుతం మానేసర్, గుర్గావ్ ప్లాంట్ల సాయంతో కంపెనీ రోజుకు 700 యూనిట్లకు పైగా స్విఫ్ట్ కార్లను ఉత్పత్తి చేస్తోంది.


Click it and Unblock the Notifications








