మారుతి సమ్మె ప్రభావం నిరుపేక్షణీయం: సుజుకి సీఈఓ

Osamu Suzuki
ఇటీవల హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో 13 రోజుల పాటు కార్మికులు సమ్మె జరపిన విషయం తెలిసిందే. అయితే, సంస్థపై ఈ సమ్మె ప్రభావం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జపాన్ కార్ల దిగ్గజం సుజుకి సీఈఓ ఒసాము సుజుకి అన్నారు. ఈ సమ్మె వల్ల తాము కోల్పోయింది కేవలం ఆరు పనిదినాలు మరియు 16,000 వాహనాల ఉత్పత్తిని మాత్రమే నష్టపోయామని అన్నారు.

ఒసాము సుజుకి ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. మార్కెట్లో ఏటా 12 లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే తమకు 16,000 యూనిట్లు పెద్ద లెక్క కాదని, దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చునని చెప్పారు. మానేసర్ కొద్ది కాలమే జరిగిన సమ్మె పట్ల తననేం ఆశ్చర్యానికి గురిచేయలేదని ఆయన అన్నారు. మానేసర్ ప్లాంటులో వర్కర్లు కొత్తగా ఏర్పాటు చేయడానికి యాజమాన్యం అంగీకరించకపోవడాన్ని మరోసారి సుజుకి ప్రస్థావించారు.

ఈ సమ్మెపై సుజుకి సీఈఓ వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి. ఈ నెల నాలుగో తేది నుంచి మానేసర్ ప్లాంటులోని దాదాపు 2,000 కార్మికులు తమ కొత్త యూనియన్ మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్‌ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలంటూ సమ్మెకు దిగడంతో హర్యానా ప్రభుత్వం చొరవ తీసుకొని యాజమాన్యానికి కార్మికులకు మధ్య సయోధ్య కుదిర్చడంతో 13 రోజుల తర్వాత వారు సమ్మె విరమించిన విషయం తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Thursday, June 23, 2011, 17:56 [IST]
English summary
The Japanese carmaker Suzuki's CEO, Osamu Suzuki, has said the strike at Maruti Suzuki's Manesar plant was negligible. He said the strike had lasted only six working days and the production loss was only 16,000 vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+