ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభకు మారుతి సుజుకి మెరుగులు

ఈ కాంపిటీషన్ యువ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థుల టాలెంట్‌ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో భాగంగా ఫార్ములా-1 స్టైల్ కార్లను డిజైన్ చేసేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మారుతి కల్పించనుంది. ఈ అగ్రిమెంట్‌పై మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ, సుప్ర ఎస్ఏఈఇండియా చైర్మన్ వి సుమంత్రన్‌లు సంతకాలు చేశారు. ఎస్ఏఈ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ రిచర్డ్ క్లీనే, సీఈఓ డాక్టర్ డేవిడ్ స్కట్, ఎగ్జిక్యూటువ్ అడ్వైజర్ ముర్లి లైర్, మారుతి సుజికి మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐవి రావ్ వంటి పరిశ్రమ దిగ్గజాల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
ఆటోమొబైల్స్ ప్యాషన్‌ను అర్థం చేసుకోవడంతో పాటు తమ ప్రతిభను చాటిచెప్పేందుకు విద్యార్థులకు ఇదొక చక్కని అవకాశం. ఈ కాంటెస్ట్‌లో 44 జట్లు తమ డ్రీమ్ కారును తయారుచేసి చెన్నయ్‌లోని మద్రాస్ మోటార్‌స్పోర్ట్ క్లబ్ రేస్ ట్రాక్‌పై పరీక్షించడం జరుగుతుంది. ఇందులో గెలిచిన అత్యుత్తమ డిజైన్ కారును ఆక్టోబర్ 2011న చెన్నయ్‌లో జరగబోయే ఆసియా పసిఫిక్ ఆటోమోటివ్ కాన్ఫరెన్స్‌లోను అలాగే ఆటో ఎక్స్‌పో 2012లో ప్రదర్శించడం జరుగుతుంది. మరిన్ని వివరాలను సుప్రఎస్ఏఈఇండియా ఆర్గ్ అనే వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








