మరిన్ని సిఎన్‌జీ, హైబ్రిడ్ మోడళ్లను ప్రవేశపెట్టనున్న మారుతి

ఈ నేపథ్యంలో మరిన్ని మోడళ్లలో సిఎన్‌జీ వేరియంట్లను అలాగే హైబ్రిడ్ మోడళ్లను ప్రవేశపెట్టాలని కంపెనీ పేర్కొంది. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరల కన్నా సిఎన్‌జీ ధర చాలా తక్కువగా ఉండమే కాకుండా, అధిక ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్)ను ఇస్తుంది. అయితే, ప్రస్తుతం సిఎన్‌జీ ఇంధన లభ్యత కొన్ని ప్రధాన మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైంది.
మారుతి సుజుకి సిఎన్‌జీ వేరియంట్లలో అందిస్తున్న మోడళ్లలో మూడు చిన్న కార్లు ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో మోడళ్లు అలాగే.. మల్టీ యుటిలిటీ వాహనం (ఎమ్‌యూవీ) ఈకో మరియు ఎస్ఎక్స్4 సెడాన్ కార్లు ఉన్నాయి. ఈ మోడళ్ల మొత్తం అమ్మకాలలో సుమారు 10 శాతం సిఎన్‌జీ వేరియంట్లే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








