మారుతిపై జపాన్ సునామీ ఎఫెక్ట్.. కోటి కార్ల ఫంక్షన్ రద్దు

Maruti
జపాన్‌లో సంభవించిన భయానక భూకంపం, సునామీల ప్రభావం దేశీయ అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకిపై తీవ్రప్రభావాన్ని చూపనుంది. ఈ ప్రభావం రానున్న కాలంలో కంపెనీ ఉత్పత్తి మందగించే అకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి మాతృ సంస్థ అయిన జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ నుంచి మారుతికి ఇంజన్స్, గేర్ బాక్స్ వంటి ముడి సరుకులు సరఫరా అవుతుంటాయి.

అయితే జపాన్‌లో సంభవించిన ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా వీటి సరఫరాలకు అంతరాయం వాటిళ్లుతుందని మారుతి సుజుకి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ అంశాన్ని మదింపు చేసే పనిలో ఉన్నామని కంపెనీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ వెల్లడించారు. అయితే ఈ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చునని, దీర్ఘకాలంలో దీని ప్రభావంపై అంచనాలు వేస్తున్నామని ఆయన తెలిపారు. సాధారణంగా రెండు వారాలకు సరిపడా ముడి సరుకులు నిల్వ ఉంటాయని, అప్పటి వరకూ కంపెనీ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుంటూనే ఉంటుందని పారీక్ వివరించారు.

మదింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎలాంటి వివరాలను వెల్లడించలేమని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. నేడు మారుతి సుజుకి ప్లాంటు నుండి కోటవ కారు ఉత్పత్తి కానుంది. ఈ సంధర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించాలని భావించిన మారుతి సుజుకి జపాన్‌లో నెలకొన్న విషాద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. జపాన్ సునామీ కారణంగా సోమవారం షేర్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి షేర్లు 3 శాతం మేర పడిపోయాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2011, 12:29 [IST]
English summary
The sudden eruption of the devastating earthquake and the tsunami has made a major hit in the Indian auto market. There could be no import of components and parts till normalcy returned as the apex companies have shut their facilities. The CGM of Maruti Suzuki said the company is taking stock of the situation and Suzuki has 55% stake hold in the company providing engines and gears for the manufacture of Swift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+